![ఆర్గాన్ డొనేషన్‌పై అపోలో .. పర్ఫెక్ట్ మ్యాచ్ క్యాంపెయిన్](https://static.v6velugu.com/uploads/2025/02/awareness-campaign-launched-under-name-perfect-match-on-occasion-of-completion-of-25-thousand-organ-transplants_GpgQeuw785.jpg)
- 25 వేల ట్రాన్స్ ప్లాంట్ మైలురాయిని చేరుకున్న అపొలో నెట్ వర్క్
హైదరాబాద్ సిటీ, వెలుగు: అపోలో హాస్పిటల్స్ నెట్ వర్క్ లో 25 వేల ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్స్ పూర్తిచేసుకున్న సందర్భంగా ‘పర్ఫెక్ట్ మ్యాచ్’ పేరుతో అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా.. చర్చలు, వర్క్‌షాపులు నిర్వహించి ఆర్గాన్ డొనేషన్ అవసరాన్ని వివరించనున్నారు.
అపోహల తొలగించి ఆర్గాన్డొనేషన్కు ముందుకు వచ్చేలా ప్రోత్సహించనున్నారు. హైదరాబాద్ రెయిన్ బో విస్టాస్ కమ్యూనిటీ వాసులకు శుక్రవారం అపోలో హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ హెచ్పీబీ, లివర్, ప్యాంక్రియాస్ ట్రాన్స్ ప్లాంట్ డాక్టర్ రవిచంద్ సిద్ధాచారి ఆర్గాన్ డొనేషన్గురించి వివరించారు. అనుమానాలను నివృత్తి చేశారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరూ ఆర్గాన్ డోనర్ గా మారాలని సూచించారు.