
- సెంట్రల్ నోడల్ ఆఫీసర్ ఆసిఫ్ ఇస్మాయిల్ ఖాన్
ములకలపల్లి, వెలుగు : ‘జలంతోటే జనం మనుగడ’ అనే నినాదాన్ని భారత్ ప్రభుత్వం క్యాచ్ ది రైన్–2024 జల శక్తి అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి మహిళకు నీటి పొదుపుపై అవగాహన కల్పిస్తోందని జల శక్తి అభియాన్ సెంట్రల్ నోడల్ ఆఫీసర్ ఆసిఫ్ ఇస్మాయిల్ ఖాన్ అన్నారు. దీనిపై సెర్ఫ్ కార్యాలయంలో మంగళవారం పొదుపు సంఘాల సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రౌండ్ వాటర్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీనివాస విఠల్ తో కలిసి ఆయన మాట్లాడారు.
బోర్లు, ఇంకుడు గుంతలు నిర్మించుకొని భూగర్భ జలాలు పెరిగేలా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాలతో నీటి పొదుపు పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకుసూచించారు. అనంతరం కార్యాలయంలో మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ, అడిషనల్ కలెక్టర్ విద్యాచందన్, అడిషనల్ డీఆర్డీవో రవికుమార్, మండల స్పెషల్ ఆఫీసర్ రమేశ్, ఎంపీడీవో మహాలక్ష్మి ,ఎంపీవో లక్ష్మయ్య, ఏపీఎం సంపత్ కుమార్ఈ పాల్గొన్నారు.