ప్రాథమిక హక్కులపై అవగాహన అవసరం

ప్రాథమిక హక్కులపై అవగాహన అవసరం

అబిడ్స్, వెలుగు: హ్యూమన్ రైట్స్ హైదరాబాద్ మహిళా విభాగ చైర్​పర్సన్ కె.సుశీల కుమారి ఆధ్వర్యంలో అబిడ్స్ సూర్యలాక్ కాంప్లెక్స్ లో మానవ హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా లోకాసమస్త హ్యూమన్ రైట్స్ ఫౌండర్, నేషనల్ చైర్మన్ జి.పి.నరసింహులు పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల గురించి ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సంస్థ విధి విధానాలను సభ్యులకు వివరించి, గుర్తింపు కార్డులు మంజూరు చేశారు.

అలాగే మానవ హక్కుల ఉల్లంఘనపై చర్చించారు. ఈ సందర్భంగా పల్లె ప్రవీణ్ ఆధ్వర్యంలో గంగరాజు, వరలక్ష్మి ఆలపించిన జానపద గేయాలు అలరించాయి. వావ్ అవార్డ్స్ ఫౌండర్ యల్.సందీప్ గౌడ్, లోకా సమస్త హ్యూమన్ రైట్స్ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ యు.రఘురాములు, ఏపీ, టీజీ చైర్మన్ సి.మోహన్ రావు, సామాజిక సేవకురాలు చంద్రప్రభ, సభ్యులు రెడ్డి ప్రసాద్, వంశీ కుమార్ రెడ్డి, జాహ్నవి, కె.లక్ష్మీసాయి నిహారిక, వీరభద్ర, నాగజ్యోతి, సిద్ధయ్య, అవినాశ్​యాదవ్, సీరియల్ ఆర్టిస్టులు రాధ, మంజుల తదితరులు పాల్గొన్నారు.