నిజామాబాద్క్రైమ్, వెలుగు : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిజామాబాద్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. జిల్లా జడ్జి సునీత కుంచాల, సీపీ కల్మేశ్వర్సింగన్వార్, అడిషనల్ కలెక్టర్కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ..
మైనర్లపై లైంగిక దాడులను అరికట్టేందుకు కేంద్రం పోక్సో చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. కార్యక్రమంలో మెజిస్ట్రేట్ కుష్బూ ఉపాధ్యాయ, దీప్తి, గోపికృష్ణ, శ్రీనివాస్, ట్రైనీ ఐపీఎస్ చైతన్య రెడ్డి, ఏఎస్పీ శేషాద్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.