ఓయూ ఇంజినీరింగ్ కాలేజీలో స్పేస్ ఆన్ వీల్స్పై అవగాహన

  •     ఉస్మానియా వర్సిటీలో ఎగ్జిబిషన్  నిర్వహణ
  •     భారీగా తరలివచ్చిన విద్యార్థులు,అధ్యాపకులు 

ఓయూ,వెలుగు: స్పేస్ టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, ఆసక్తిని పెంపొందించడం, స్పేస్ రీసెర్చ్ , ఇస్రో వ్యవస్థను అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఓయూ ఇంజినీరింగ్ కాలేజీలో గురువారం ‘ స్పేస్ ఆన్ వీల్స్ ’ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సీ సంయుక్తంగా నిర్వహించాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగింది.  ముందుగా ఎగ్జిబిషన్ ను  ఓయూ రిజిస్ట్రార్ పి. లక్ష్మినారాయన ప్రారంభించి మాట్లాడారు. జీడిమెట్లలోని ఇస్రోలోని ఎన్ఆర్ఎస్సీలో సైంటిస్ట్ ఎస్ఎఫ్ శ్రీనివాస్ ప్రదర్శనకు నేతృత్వం వహించి చంద్రయాన్-– 3, ఇస్రో విజయాలపై అవగాహన ఎగ్జిబిషన్ కన్వీనర్ ఈసీఈ ప్రొఫెసర్ నవీన్ కుమార్ కల్పించారు.   ప్రదర్శనలో ఓషియన్​శాట్, రిశాట్, రిసోర్స్​శాట్, చంద్రయాన్ శాటిలైట్ నమూనాలను జీడిమెట్లలోని ఎన్ఆర్ఎస్​సీ  ఔట్ రీచ్ ఫెసిలిటీ ద్వారా  ప్రదర్శించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీ నుంచి  సుమారు 1,000 మంది విద్యార్థులు, అధ్యాపకులు తరలివచ్చారు.