బేటీ బచావో–బేటీ పడావోపై అవగాహన

జగిత్యాల టౌన్, వెలుగు: జిల్లాలోని కేజీబీవీ స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లకు శుక్రవారం జిల్లా మహిళా సాధికారత బృందం ఆధ్వర్యంలో బేటీ బచావో–బేటీ పడావోపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మహిళా సాధికారత, మహిళలు ఇంట్లో, సమాజంలో ఎదుర్కొంటున్న హింస, హక్కులు, అధికారాల గురించి వివరించారు. కార్యక్రమంలో కేజీబీవీ కోఆర్డినేటర్ అనుపమ, స్పెషల్ ఆఫీసర్ మధులత, అశ్విని, గౌతమి, హేమశ్రీ, కేజీబీవీ టీచర్స్ పాల్గొన్నారు.