క్యాన్సర్​ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

క్యాన్సర్​ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

 కాశీబుగ్గ/ జనగామ అర్బన్, వెలుగు ​: క్యాన్సర్​ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు వక్తలు అన్నారు. వ్యాధి మొదటి దశలోనే జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా నివారించవచ్చని తెలిపారు. వరల్డ్​ క్యాన్సర్​డే సందర్భంగా ఉమ్మడి వరంగల్​ జిల్లాలో అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహించారు.

వరంగల్​ జిల్లా వైద్యారోగ్య ఆఫీస్​లో నిర్వహించిన మీటింగ్​లో డీఎంహెచ్​వో సాంబశివరావు, జనగామలో లీగల్​ సర్వీసెస్​ అథారిటీ ఆధ్వర్యంలో ఎంసీహెచ్​లో నిర్వహించిన సదస్సులో జనగామ జిల్లా కోర్టు సీనియర్​ సివిల్​ జడ్జి సి.విక్రమ్​ డీఎంహెచ్​వో మల్లికార్జున్​ రావు కలిసి పాల్గొని వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై వివరించారు. కాళోజీ కళాక్షేత్రంలో ప్రతిమట్రస్ట్​ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, సదస్సులో ఎంపీ కడియం కావ్య, సినీ నటి గౌతమి పాల్గొని మాట్లాడారు.