
2016 వికలాంగుల చట్టంపై అవగాహన కల్పించేవిధంగా చైతన్య కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలోని 12,769 గ్రామాలలో ఉన్న ప్రతి వికలాంగుడికి 2016 వికలాంగుల చట్టం అంటే అవగాహన కల్పించడానికిగాను ప్రతి గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో వికలాంగులపై వివక్షత, దౌర్జన్యాలు, మోసాలు, అవమానాలు జరుగుతున్నాయి. కనుక ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2016 వికలాంగుల చట్టంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
ఆ చట్టం అతిక్రమించిన వారిపై కేసు నమోదు చేయడం, జరిమానా విధించడం, జైలు శిక్ష విధించడం వంటి కార్యక్రమాలను కఠినతరం చేయాలి. 2016 వికలాంగుల హక్కుల చట్టం నిబంధనలను ప్రతి పోలీస్ స్టేషన్, ప్రతి ప్రభుత్వ కార్యాలయం, గ్రామపంచాయతీ నుంచి రాష్ట్రస్థాయి సచివాలయం వరకు ప్రదర్శించాలి. ఉద్యోగ వికలాంగులకు రక్షణ కవచంగా 2016 వికలాంగుల చట్టం తోడ్పడాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఉన్న నిబంధనలను వికలాంగులకు కూడా వర్తింపజేయాలి. వికలాంగులైన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో 5 శాతం రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేయాలి.
- డా. ఈదునూరి వెంకటేశ్వర్లు