కామారెడ్డి/ కామారెడ్డి టౌన్, వెలుగు : రోడ్డు భద్రతా నియమాలపై విద్యార్థులు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం రాజంపేట మండలం బస్సన్నపల్లిలో విద్యార్థులకు అవగాహన ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ బైక్స్ నడిపించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రమాదాలు తగ్గించాలన్నారు.
భిక్కనూరు టోల్ ఫ్లాజా వద్ద వెహికల్స్‌కు రేడియం స్టిక్కర్స్ ప్రాధాన్యత గురించి వివరించారు. ఇందులో ఏఎంవీఐలు అప్రోజుద్ధీన్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రతిభ స్కూల్ విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టౌన్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.