
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్
రంగారెడ్డి, వెలుగు: ఓటు హక్కుపై మొబైల్ వెహికల్స్ ద్వారా ఈ నెల 20 నుంచి 90 రోజుల పాటు అవగాహన కల్పించనున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. రాజేంద్రనగర్‌లోని ఈవీఎంల గోడౌన్‌ను మంగళవారం ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహేశ్వరం, ఎల్బీనగర్, చేవెళ్ల, షాద్‌నగర్, కల్వకుర్తి, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి సెగ్మెంట్లకు సంబంధించి ఈవీఎంలను ప్రతి గ్రామానికి పంపించి, మొబైల్ వెహికల్స్‌తో జనాలకు అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.