- క్రానిక్ కిడ్నీ డిసీజ్ క్లినిక్ ఓపెన్ చేసిన యశోద హాస్పిటల్స్
మాదాపూర్, వెలుగు : కిడ్నీ సంబంధిత బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారని, ఈ వ్యాధులపై అందరికీ అవగాహన ఉండాలని యశోద హాస్పిటల్స్ గ్రూప్స్ చైర్మన్ గోరుకంటి రవీందర్రావు అన్నారు. జగద్గురువు శివరాత్రి దేశికేంద్ర మహాస్వామీజీ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. దేవదాస్, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరితో కలిసి హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ గోరుకంటి రవీందర్ రావు క్రానిక్ కిడ్నీ డిసీజ్ క్లినిక్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతీసంవత్సరం దాదాపు 5 లక్షల మంది కొత్త కిడ్నీ రోగులు డయాలసిస్ దశకు చేరుకుంటున్నారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జనాభాలో 20% కంటే ఎక్కువ మందిలో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ కు గురవుతున్నారని చెప్పారు.
ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని క్లినిక్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం యశోద హాస్పిటల్స్- సీనియర్ నెఫ్రాలజిస్ట్ , కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్. రాజశేఖర చక్రవర్తి సీనియర్ నెఫ్రాలజిస్ట్ కన్సల్టేషన్ తో సహా ప్రోటోకలైజ్డ్ కేర్, డైటీషియన్ అత్యాధునిక పరికరాలు, మందులను ఉపయోగిస్తామని తెలిపారు.