- కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీ నుంచి సుందరయ్య పార్క్ వరకు
బాగ్‌లింగంపల్లిలోని కాకా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కాలేజీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. కాలేజీ నుంచి సుందరయ్య పార్క్ వరకు స్టూడెంట్లు, లెక్చరర్లు ర్యాలీ నిర్వహించారు. హెచ్ఐవీకి దూరంగా ఉండాలంటూ నినాదాలు చేశారు. ర్యాలీలో కాలేజీ డైరెక్టర్ డాక్టర్ విష్ణుప్రియ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్, ప్రిన్సిపాల్, లెక్చరర్లు పాల్గొన్నారు