బెంగళూరు: అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ఇండియా దేశంలోనే తన మొట్టమొదటి స్పేస్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ కోసం 24 స్పేస్ టెక్నాలజీ స్టార్టప్‌లను ఎంపిక చేసింది. ‘ఏడబ్ల్యూఎస్ స్పేస్ యాక్సిలరేటర్: ఇండియా’ అనే కార్యక్రమం ద్వారా అంతరిక్ష రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడంతోపాటు టెక్నాలజీ, ప్రత్యేక శిక్షణ అందిస్తారు.
భారతదేశం అంతటా అంతరిక్ష స్టార్టప్‌ల అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఎడబ్ల్యూఎస్.. ఇస్రో, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఏడబ్ల్యూఎస్‌లో డైరెక్టర్ (ఏరోస్పేస్ శాటిలైట్ బిజినెస్) కెల్లింట్ క్రోసియర్ మాట్లాడుతూ, స్పేస్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను నిర్వహించడం ఇది వరుసగా నాలుగో సంవత్సరమని చెప్పారు. ఈ ప్రోగ్రామ్‌కు టీ–హబ్ కూడా మద్దతు ఇస్తోంది.