DC vs MI: అక్షర్ పటేల్‌కు బ్యాడ్ న్యూస్.. ఓటమితో పాటు భారీ జరిమానా!

DC vs MI: అక్షర్ పటేల్‌కు బ్యాడ్ న్యూస్.. ఓటమితో పాటు భారీ జరిమానా!

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ పై జరిమానా విధించబడింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం (ఏప్రిల్ 13) ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా అక్షర్ కు బీసీసీఐ రూ.12 లక్షల రూపాయల ఫైన్ వేశారు. దీంతో ఐపీఎల్ 2025 సీజన్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్న ఐదో కెప్టెన్ గా నిలిచాడు. అంతకముందు హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్,  రియాన్ పరాగ్, రజత్ పటిదార్ స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్నారు. 

అక్షర్ నిర్ణీత సమయం లోపు ఇన్నింగ్స్ ను పూర్తి చేయలేకపోయాడు. మొదట ముంబై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ దాదాపు రెండు గంటల పాటు సాగింది. ముంబై బ్యాటర్లు చెలరేగడంతో ఢిల్లీ బౌలింగ్ ప్రణాళికలు, ఫీల్డింగ్ సెట్ చేయడంలో ఎక్కువ సమయం తీసుకుంది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఐపీఎల్ పాలక మండలి కొన్ని మార్పులు చేసింది. స్లో ఓవర్ రేట్ వేసిన కెప్టెన్లకు జరిమానా విధించబడదు. అయితే కెప్టెన్లకు డీమెరిట్ పాయింట్లు ఇస్తారు. ఇవి మూడు సంవత్సరాల పాటు కొనసాగుతాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)

అక్షర్ పటేల్ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2025 లో తొలి పరాజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అక్షర్ పూర్తిగా  విఫలమయ్యాడు. మొదట బౌలింగ్ లో 2 ఓవర్లలో 19 పరుగులిచ్చిన ఢిల్లీ కెప్టెన్.. ఆ తర్వాత బ్యాటింగ్ లో 9 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆదివారం (ఏప్రిల్ 13) ముంబై ఇండియన్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో  జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 12 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది.

ALSO READ RR vs RCB: జెంటిల్‌మన్ అంటే నువ్వేనయ్యా: విరాట్ కోహ్లీ రిక్వెస్ట్‌ను తిరస్కరించిన ద్రవిడ్

ఒక దశలో ఓటమి ఖాయమనుకున్న హార్దిక్ సేన అద్భుతంగా ఆడి మ్యాచ్ గెలవడం విశేషం. చివర్లో ఒత్తిడి తట్టుకోలేక ఢిల్లీ వరుసగా రనౌట్ లు కావడం వారి కొంప ముంచింది. మొదట బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించిన హార్దిక్ సేన.. కీలక సమయంలో అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచ్ గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయింది.