DC vs RR: సూపర్ ఓవర్‌లో అతడిని పంపకపోవడం మాకు కలిసొచ్చింది: అక్షర్ పటేల్

DC vs RR: సూపర్ ఓవర్‌లో అతడిని పంపకపోవడం మాకు కలిసొచ్చింది: అక్షర్ పటేల్

ఐపీఎల్ 2025 లో బుధవారం (ఏప్రిల్ 16) రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకి ఫుల్ పైకి ఇచ్చింది. ఈ సీజన్ లో తొలిసారి సూపర్ ఓవర్ జరగడమే ఇందుకు కారణం. 189 పరుగుల ఛేజింగ్ లో మ్యాచ్ మొత్తం ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఉన్నప్పటికీ స్టార్క్ అద్భుతంగా వేసిన చివరి ఓవర్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ను టై చేసుకోగలిగింది. రాజస్థాన్ విజయానికి చివరి ఓవర్ లో 9 పరుగులు కావాల్సిన దశలో డేల్ స్టెయిన్ తన యార్కర్లతో కేవలం 8 పరుగులే ఇచ్చి సూపర్ ఓవర్ కు తీసుకెళ్లాడు. 

సూపర్ ఓవర్ లో రాజస్థాన్ మొదట బ్యాటింగ్ కు వచ్చింది. ఢిల్లీ తరపున స్టార్క్ సూపర్ ఓవర్ వేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ దశలో రాజస్థాన్ యాజమాన్యం రియాన్ పరాగ్, హెట్ మేయర్ ను సూపర్ ఓవర్ ఆడేందుకు బరిలోకి దింపారు. స్టార్క్ పై ఆధిపత్యం చూపించే యశస్వి జైశ్వాల్ ను పంపకపోవడం షాక్ కు గురి చేసింది. జైశ్వాల్ సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ కు పంపాల్సిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ సైతం జైశ్వాల్ రాకపోవడం తనకు ఆశ్చర్యకరంగా అనిపించిందని చెప్పాడు. 

మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. " సూపర్ ఓవర్ లో నేరుగా జైశ్వాల్ బ్యాటింగ్ కు వస్తాడని భావించాను. ఏం జరిగిందో నాకు తెలియదు. అతను బ్యాటింగ్ కు రాకపోవడం మాకు మంచి జరిగింది". అని అక్షర్ పటేల్ అన్నాడు. ఈ మ్యాచ్ లో స్టార్క్ బౌలింగ్ లో జైశ్వాల్ ఆధిపత్యం చూపించాడు. స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో ఒక సిక్సర్, రెండు ఫోర్లతో 19 పరుగులు రాబట్టాడు. 

►ALSO READ | IPL 2025: స్టెయిన్ చెప్పిన రోజు వచ్చేసింది.. వాంఖడేలో 300 పరుగులు ఖాయమా..

అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ 188 పరుగులు చేయడంతో మ్యాచ్ టై గా ముగిసింది. సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 11 పరుగులు మాత్రమే చేయగలిగింది. 12 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఒక రెండు బంతులు మిగిలి ఉండగానే థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. సూపర్ ఓవర్ లో రాహుల్ ఫోర్ కొట్టగా.. స్టబ్స్ సిక్సర్ కొట్టి మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. స్టార్క్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.