
దుబాయ్: పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ సెంచరీ కోసం అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు తోటి క్రికెటర్లు కూడా చాలా ఆతృతగా ఎదురుచూశారు. ఈ క్రమంలో అవతలి ఎండ్‌లో ఉన్న అక్షర్ పటేల్ హ్యూమన్ కాలిక్యులేటర్‌గా మారిపోయి లెక్కలు వేశాడంట. ఎలాగైనా విరాట్ సెంచరీ మైలురాయిని చేరుకోవాలని ఆశించినట్లు అక్షర్ వెల్లడించాడు.
‘అవతలి ఎండ్‌లో ఉన్నప్పుడు నేను కూడా లెక్కలు వేశా. బాల్ ఎడ్జ్‌ను తాకొద్దని, నా నుంచి రన్స్ రావొద్దని కోరుకున్నా. చాలా సరదాగా అనిపించింది’ అని అక్షర్ పేర్కొన్నాడు. ఇండియా గెలవడానికి 19 రన్స్ అవసరమైనప్పుడు కోహ్లీ 86 రన్స్ వద్ద ఉన్నాడు. ఈ దశలో షాహీన్ ఆఫ్రిది 42వ ఓవర్‌లో మూడు వైడ్‌లు వేయడంతో విరాట్ సెంచరీ అవుతుందా..? లేదా..? అన్న సందేహాలు నెలకొన్నాయి. ఇక కోహ్లీ 96కు చేరుకున్నప్పుడు ఇండియా విజయానికి రెండు రన్సే అవసరం. కెప్టెన్ రోహిత్ సిక్స్ కొట్టమని సైగ చేస్తే విరాట్ బౌండ్రీతో వంద అందుకున్నాడు.