IND vs BAN: ఎంతపని చేశావ్ హిట్ మ్యాన్: రోహిత్ వల్ల నాలుగు రికార్డ్స్ మిస్ చేసుకున్న అక్షర్

IND vs BAN: ఎంతపని చేశావ్ హిట్ మ్యాన్: రోహిత్ వల్ల నాలుగు రికార్డ్స్ మిస్ చేసుకున్న అక్షర్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పిదం వల్ల ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ నాలుగు అరుదైన రికార్డ్స్ కోల్పోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ తో భారత్ గురువారం (ఫిబ్రవరి 20) తమ తొలి మ్యాచ్ లో తలబడుతుంది. ఇన్నింగ్స్ 9 ఓవర్లో అక్షర్ రెండు, మూడు బంతుల్లో తంజిద్‌ హసన్(25), ముష్ఫికర్‌(0)ను ఔట్ చేశాడు. ఈ రెండు క్యాచ్ లను వికెట్ కీపర్ రాహుల్ అద్భుతంగా పట్టుకున్నాడు. ఈ దశలో అక్షర్ కు హ్యాట్రిక్ అవకాశం వచ్చింది.

నాలుగో బంతిని ఆఫ్ స్టంప్ కు దూరంగా వేశాడు. బంగ్లా బ్యాటర్ జేకర్ అలీ డిఫెన్స్ చేయగా బంతి బ్యాట్ ఎడ్జ్ తాకి ఫస్ట్ స్లిప్ లో ఉన్న రోహిత్ వద్దకు వెళ్ళింది. చేతిలోకి వచ్చిన ఈజీ క్యాచ్ కు రోహిత్ జారవిడిచారు. దీంతో టీమిండియా కెప్టెన్ క్యాచ్ మిస్ చేసినందుకు అసహనానికి గురయ్యాడు. మరోవైపు అక్షర్ హ్యాట్రిక్ మిస్ అయినందుకు హిట్ మ్యాన్ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. హ్యాట్రిక్ మిస్ అవ్వడంతో అక్షర్ పటేల్ కు రోహిత్ క్షమాపణలు తెలిపాడు.

రోహిత్ క్యాచ్ జారవిడవడంతో అక్షర్ నాలుగు రికార్డ్స్ మిస్ చేసుకున్నాడు. ఒకవేళ రోహిత్ క్యాచ్ పట్టి ఉంటే అక్షర్ హ్యాట్రిక్ పూర్తయ్యేది. అదే జరిగితే వన్డే ఐసీసీ ఈవెంట్స్ లో హ్యాట్రిక్ తీసుకున్న డెబ్యూ ప్లేయర్ గా అక్షర్ రికార్డ్ సృష్టించేవాడు. వన్డేల్లో కుల్దీప్ యాదవ్ తర్వాత హ్యాట్రిక్ తీసుకున్న రెండో ప్లేయర్ గా అరుదైన జాబితాలో అక్షర్ నిలిచేవాడు. ఐసీసీ ఈవెంట్స్ లో హ్యాట్రిక్ తీసుకున్న తొలి భారత ప్లేయర్ గా అక్షర్ నిలిచేవాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ తీసుకున్న రెండో ప్లేయర్ గా రికార్డ్ ను  తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ 30 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. క్రీజ్ లో జేకర్ అలీ (40), హృదయ్ (35) క్రీజ్ లో ఉన్నారు. 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న బంగ్లాదేశ్ ను వీరిద్దరూ ఆదుకున్నారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, షమీ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. హర్షిత్ రాణాకు ఒక వికెట్ దక్కింది.