యాక్సిస్ బ్యాంక్​కు సిటీతో నష్టం

న్యూఢిల్లీ:  యాక్సిస్ బ్యాంక్  పనితీరు ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  (క్యూ4) లో మెరుగుపడింది. కానీ, సిటీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఇండియా కన్జూమర్ బిజినెస్‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేయడంతో బ్యాంక్‌‌‌‌‌‌‌‌కు క్యూ4 లో నష్టాలొచ్చాయి.  ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ4) లో యాక్సిస్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌కు రూ. 5,728.42 కోట్ల నష్టం వచ్చింది. సిటీ బ్యాంక్ అక్విజేషన్ కోసం చేసిన ఖర్చులు పక్కకు పెడితే బ్యాంక్ నికర లాభం క్యూ4 లో రూ. 6,625 కోట్లుగా రికార్డయ్యింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 61 శాతం పెరిగింది. యాక్సిస్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌కు క్యూ4 లో రూ. 11,742 కోట్ల నికర వడ్డీ ఆదాయం వచ్చింది.  ఏడాది  ప్రాతిపదికన చూస్తే ఇది 33 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌కు సమానం. బ్యాంక్  నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 73 బేసిస్ పాయింట్లు పెరిగి 4.22 శాతానికి చేరుకుంది. బ్యాంక్ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌లు  ఏడాది ప్రాతిపదికన 19 శాతం  ఎగిసి క్యూ4 లో రూ.8,45,303 కోట్లకు  పెరిగాయి. కిందటేడాది డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఇది 11 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌కు సమానం. డొమెస్టిక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఇచ్చిన లోన్లు ఏడాది ప్రాతిపదికన 23 శాతం,  క్వార్టర్లీ ప్రాతిపదికన 13 శాతం పెరిగాయి. రిటైల్ లోన్లు ఏడాది ప్రాతిపదికన 22 శాతం, క్వార్టర్లీ ప్రాతిపదికన 14 శాతం పెరిగి రూ.4,87,571 కోట్లకు చేరుకున్నాయి. 

బ్యాంక్‌‌‌‌‌‌‌‌ నెట్ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌లలో  రిటైల్ లోన్ల వాటా 58 శాతంగా ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ షీట్‌‌‌‌‌‌‌‌ ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.13,17,326 కోట్లకు ఎగిసింది.  డిపాజిట్లు కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 15 శాతం, డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 12 శాతం పెరిగాయి. 2022–23 ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే యాక్సిస్ బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 26 శాతం తగ్గి రూ.9,58‌‌‌‌‌‌‌‌0 కోట్లుగా  రికార్డయ్యింది. సిటీ బ్యాంక్ అక్విజేషన్ ట్రాన్సాక్షన్లను పక్కన పెడితే 68 శాతం పెరిగి రూ.21,933 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం  30 శాతం పెరిగి రూ. 42,946 కోట్లకు చేరుకుంది.  బ్యాంక్ అసెట్ క్వాలిటీ మెరుగుపడింది. క్యూ4 లో బ్యాంక్ గ్రాస్ ఎన్‌‌‌‌‌‌‌‌పీఏల రేషియో   క్వార్టర్లీ ప్రాతిపదికన 36 బేసిస్ పాయింట్లు తగ్గి 2.02 శాతంగా నమోదయ్యింది. నెట్ ఎన్‌‌‌‌‌‌‌‌పీఏల రేషియో 8 బేసిస్ పాయింట్లు తగ్గి 0.39 శాతానికి మెరుగుపడింది. 
డెట్ మార్కెట్ నుంచి  రూ.35 వేల కోట్లను సేకరించేందుకు బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది. 2022–23 కి గాను షేరుకి రూ.1 ఫైనల్ డివిడెండ్‌‌‌‌‌‌‌‌గా ఇస్తామని ప్రకటించింది. బ్యాంక్ షేరు గురువారం 0.8 శాతం నష్టపోయి రూ.881  వద్ద క్లోజయ్యింది.

బజాజ్ ఫిన్సర్వ్‌‌‌‌‌‌‌‌..

ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ కంపెనీ బజాజ్ ఫిన్సర్వ్‌‌‌‌‌‌‌‌ కు ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.1,769 కోట్ల నెట్‌‌‌‌‌‌‌‌ ప్రాఫిట్ (కన్సాలిడేటెడ్‌‌‌‌‌‌‌‌) వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ.1,346 కోట్లతో పోలిస్తే 31 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం రూ. 18,862 కోట్ల నుంచి 25 శాతం పెరిగి రూ.23,625 కోట్లకు చేరుకుంది. ఇందులో వడ్డీ ఆదాయం రూ. 11,025 కోట్లుగా ఉంది. కిందటేడాది  మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ.8,383 కోట్లతో పోలిస్తే ఇది 31 శాతం ఎక్కువ.  షేరుకి  8‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 పైసలు డివిడెండ్‌‌‌‌‌‌‌‌గా ఇచ్చేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. డివిడెండ్‌‌‌‌‌‌‌‌ కింద రూ.127.43 కోట్లు ఖర్చు చేస్తారు. యాన్యువల్ జనరల్ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో అనుమతులు వస్తే జులై 28 లోపు లేదా ఆ రోజున డివిడెండ్ ఇస్తారు. కంపెనీ షేర్లు గురువారం 2.4 శాతం పెరిగి రూ.1,367 వద్ద క్లోజయ్యాయి. బజాజ్ ఫిన్సర్వ్‌‌‌‌‌‌‌‌కు 2022–23 లో రూ. 6,417 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.4,557 కోట్లతో పోలిస్తే ఇది 41 శాతం ఎక్కువ.