యాక్సిస్ బ్యాంక్ లాభం రూ. 6,035 కోట్లు

యాక్సిస్ బ్యాంక్ లాభం రూ. 6,035 కోట్లు

న్యూఢిల్లీ:  ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంకు  జూన్ 2024 క్వార్టర్​లో నికర లాభం 4 శాతం పెరిగి రూ. 6,035 కోట్లకు చేరుకుంది. ప్రధానంగా అధిక వడ్డీ ఆదాయం కారణంగా లాభం పెరిగింది.   2023-–24 ఏప్రిల్–-జూన్  క్వార్టర్​లో దీని స్టాండ్‌‌‌‌లోన్ నికర లాభం రూ. 5,797 కోట్లు ఉంది.  మొదటి క్వార్టర్​లో  వడ్డీ ఆదాయం రూ.25,556.77 కోట్ల నుంచి రూ.30,060.73 కోట్లకు పెరిగిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లో బ్యాంకు పేర్కొంది.  

తాజా క్వార్టర్​లో దాని మొత్తం ఆదాయం రూ. 35,844.22 కోట్లుగా ఉండగా,   ఏడాది క్రితం రూ. 30,644 కోట్లు వచ్చాయి. 2023 మొదటి క్వార్టర్​లో గ్రాస్​ఎన్​పీఏలు 1.96 శాతం ఉండగా,   2024 జూన్ క్వార్టర్​లో ఇవి 1.54 శాతానికి మెరుగుపడ్డాయి. నెట్​ ఎన్​పీఏ జూన్ 2023లో 0.41 శాతం నుంచి ఈసారి 0.34 శాతానికి మెరుగుపడ్డాయి.