ఏవైసీఏ హ్యాట్రిక్ విక్టరీ

ఏవైసీఏ హ్యాట్రిక్ విక్టరీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: తెలంగాణ డిస్ట్రిక్స్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ (టీడీసీఏ) అండర్‌‌‌‌‌‌‌‌17 వన్డే ట్రోఫీలో అమెరికన్ యూత్​ క్రికెట్ అకాడమీ (ఏవైసీఏ) జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో ఏవైసీఏ  6 వికెట్ల తేడాతో తెలంగాణ రూరల్ వారియర్స్‌‌‌‌ జట్టును ఓడించింది. తొలుత వారియర్స్‌‌‌‌ 36.1 ఓవర్లలో 105 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. 

ఛేజింగ్‌‌‌‌లో అమెరికా టీమ్‌‌‌‌16 ఓవర్లలోనే 108/4 స్కోరు చేసి గెలిచింది. అడ్నిట్ జాంబ్ (43, 3/7) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌గా నిలిచాడు. మరో మ్యాచ్‌‌‌‌లో ఆర్‌‌‌‌. పృథ్వీశ్వర్‌‌‌‌ (103; 3/30) ఆల్‌‌‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌‌‌‌తో తెలంగాణ పాంథర్స్ టీమ్ 124 రన్స్‌‌‌‌ తేడాతో రూరల్‌‌‌‌ రైజర్స్‌‌‌‌ను చిత్తు చేసింది.  పృథ్వీశ్వర్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్‌‌‌‌ అవార్డును టీడీసీఏ  ప్రెసిడెంట్ వెంకటేశ్వర్‌‌‌‌ రెడ్డి  అందించారు.