ఏవైసీఏ భారీ విజయం

ఏవైసీఏ భారీ విజయం

హైద‌‌‌‌రాబాద్‌‌‌‌, వెలుగు: అమెరికా యూత్ అకాడ‌‌‌‌మీ (ఏవైసీఏ), తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేష‌‌‌‌న్ (టీడీసీఏ) అండర్‌‌‌‌‌‌‌‌–17 వన్డే క్రికెట్ టోర్నమెంట్‌‌‌‌లో ఏవైసీఏ టీమ్ శుభారంభం చేసింది. సోమ‌‌‌‌వారం శంషాబాద్‌‌‌‌లో జరిగిన ఆరంభ మ్యాచ్‌‌‌‌లో  104 రన్స్ తేడాతో తెలంగాణ రూరల్‌‌‌‌ పాంథర్స్‌‌‌‌పై  విజయం సాధించింది. తొలుత ఏవైసీఏ 50 ఓవర్లలో 242/9 స్కోరు చేసింది. 

జాంబ్‌‌‌‌ (57), తనుశ్‌‌‌‌ (41) రాణించారు. ఛేజింగ్‌‌‌‌లో తెలంగాణ పాంథర్స్‌‌‌‌ 27ఓవర్లలో138 రన్స్‌కే ఆలౌటైంది.  శాండీ (70) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌ కాగా..  ఏవైసీఏ బౌలర్లు రిత్విక్‌‌‌‌ (4/19), శ్రేయాన్స్‌‌‌‌ (2/12) సత్తా చాటారు.  అంతకుముందు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర  టీడీసీఏ  ప్రెసిడెంట్‌‌‌‌ వెంకటేశ్వర్‌‌‌‌ రెడ్డితో కలిసి ఈ టోర్నమెంట్‌‌‌‌ను ప్రారంభించారు. రాష్ట్రంలో గ్రామీణ క్రికెట్ అభివృద్ధే ల‌‌‌‌క్ష్యంగా టీడీసీఏ చేస్తున్న కృషిని  ర‌‌‌‌విచంద్ర కొనియాడారు.