ఆస్టానా (కజకిస్తాన్): ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను ఇండియా మూడు పతకాలతో ముగించింది. విమెన్స్ డబుల్స్‌లో ఐహికా ముఖర్జీ–సుతీర్థ ముఖర్జీ చారిత్రక కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. వరల్డ్ 15 ర్యాంకర్ ఐహిక–సుతీర్థ ఆదివారం జరిగిన సెమీఫైనల్లో 4–11, 9–11, 8–11తో జపాన్‌కు చెందిన విమా హరిమొటో–మియు కిహారా చేతిలో ఓడి కంచు పతకంతో తిరిగొచ్చారు.
అంతకుముందు మనిక బత్రా, ఐహికా ముఖర్జీ, ఆకుల శ్రీజ, సుతీర్థ ముఖర్జీలతో కూడిన విమెన్స్ టీమ్, శరత్ కమల్, మానవ్ ఠక్కర్, హర్మీత్ దేశాయ్‌తో కలిసిన మెన్స్ టీమ్ కూడా కాంస్య పతకాలు రాబట్టాయి.