![డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే అయోధ్యలో రామాలయం నిర్మాణం: ప్రధాని మోదీ](https://static.v6velugu.com/uploads/2023/12/ayodaya-modi-meeting_pWOoHt547Q.jpg)
అయోధ్య ప్రజలు తనకు ఘన స్వాగతం పలికారని ప్రధాని మోదీ అన్నారు.డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 22న జరిగే కార్యక్రమం కోసం ఎదురు చేస్తున్నారన్నారు. నేను కూడా మీలాగే ఎదురు చూస్తున్నానని తెలిపారు. అయోధ్యలో జరిగే శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరుగుతుందన్నారు.అయోధ్య దేశ చరిత్ర పటంలో గర్వంగా నిలుస్తుందని అయోధ్యలో జరిగిన సభలో తెలిపారు. ఏ దేశమైనా అభివృద్ది చెందాలంటే వారసత్వమే మనకు మార్గం చూపుతుందని ప్రధాని మోదీ అన్నారు.
ఆధునిక అయోధ్య నిర్మాణానికి అంకురార్పణ జరిగిందనని ప్రధాని మోదీ అన్నారు. ఇది అయోధ్య వాసుల కష్టానికి తగిన ప్రతిఫలమన్నారు. ఆలయాల పునర్నిర్మాణంలో భారత్ దూసుకుతోతుంది. ఒకప్పుడు అయోధ్యలో శ్రీరాముడు టెంట్లో ఉంటే... ఇప్పుడు రామ జన్మభూమిలో శ్రీరాముడికి గొప్ప మందిరం వచ్చిందన్నారు. అయోధ్య విమానాశ్రయంతో అత్యాధునిక అంతర్జాతీయ విమానాలు ల్యాండ్ అయ్యేలా చూస్తామన్నారు. రామాయణం రాసిన వాల్మికి పేరును అయోధ్య విమానాశ్రయానికి పేరు పెడతామన్నారు. ఎయిర్ పోర్టులో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు వాల్మికి మహర్షి పేరు తలుచుకుంటారన్నారు, జనవరి 22న అయోధ్యలో దీపావళి పండుగ జరగనుందన్నారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట రోజు దేశ ప్రజలందరు ఇళ్లలో జ్యోతిని వెలిగించాలన్నారు. స్వచ్చ అయోధ్యను నిర్మించాల్సిన బాధ్యత అయోధ్య ప్రజలపై ఉందన్నారు.
యూపీ మొత్తం అయోధ్యను స్ఫూర్తిగామారుతుందన్నారు. అయోధ్యలో కొత్త టౌన్ షిప్ను నిర్మిస్తామన్నారు. వందే భారత్, అమృత్ భారత్ రైళ్లు అయోధ్య నుంచి వెళతాయన్నారు. అయోధ్య రామాలయాన్ని సందర్శించే వారు పార్కింగ్ కు ఇబ్బంది పడకుండా కారు పార్కింగ్ కూడా ఏర్పాటు చేశామన్నారు.