దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి అయోధ్య రామాలయానికి సంబంధించిన పలు వస్తువులు తరలి వెళుతున్నాయి. ఒక్కో వస్తువు ఒక్కో ప్రదేశంలో తయారైంది. దేశవ్యాప్తంగా రామజన్మభూమిలో రామ మందిరం నిర్మాణంలో చాలా పట్టణాలు పాలు పంచుకున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో అయోధ్య రామాలయం తలుపులు తయారుకాగా...స్వామివారి పాదుకలను బోయినపల్లికి చెందిన శ్రీమద్విరాట్ కళా కుటీర్ లోహ శిల్పి పిట్లంపల్లి రామలింగచారి తయారు చేశారు.
దేశ వ్యాప్తంగా అందరి చూపు ఇప్పుడు అయోధ్య మీదనే. ఈ నెల (జనవరి) 22న దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్య రాముల వారి విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి అయోధ్య రామాలయానికి సంబంధించిన పలు వస్తువులు తరలి వెళుతున్నాయి.
రామమందిరంలో ఉంచే పాదుకలను హైదరాబాద్ లో తయారు చేశారు. సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ ప్రాంతమైన బోయిన్ పల్లికి చెందిన ఒక లోహ కళాకారుడు వీటిని తయారు చేశారు. బోయిన్ పల్లికి చెందిన శ్రీమద్విరాట్ కళా కుటీర్ లోహ శిల్పి పిట్లంపల్లి రామలింగచారి ఈ పాదకుల్ని తయారు చేశారు.
ఈ పాదకులను తయారు చేసేందుకు 15 కేజీల పంచలోహాల్ని వాడటంతో పాటు వెండి.. బంగారంతో తాపడటం చేశారు. వీటి తయారీకి 25 రోజులు పట్టిందని.. ఈ పాదుకలను భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ వ్యవస్థపాకుడు చర్ల శ్రీనివాస శాస్త్రి ఆధ్వర్యంలో సిద్ధం చేశారు. అయితే.. ఆసక్తికరమైన అంశం ఏమంటే. .ఇదే బోయిన్ పల్లికి చెందిన అనురాధ టింబర్ డిపో వారు అయోధ్య రామాలయానికి వినియోగించే తలుపుల్ని తయారు చేయటం తెలిసిందే. అయోధ్య రామాలయ ట్రస్టు నిర్వహించిన టెండర్లలో ఈ సదవకాశాన్ని పెద్దపెద్ద కంపెనీలతో పోటీ పడి మరి అనురాధ టింబర్ డిపో దక్కించుకుంది. దీంతో.. హైదరాబాద్ సత్తా దేశానికి మరోసారి తెలిసిన పరిస్థితి. తాజాగా రాములోరి పాదుకల్ని సైతం నగరంలోనే తయారు చేయించిన వైనం ఆసక్తికరంగా మారింది.