అయోధ్య రామ మందిరం నమూనాలో బాలాపూర్​ గణపతి మండపం

అయోధ్య రామ మందిరం నమూనాలో బాలాపూర్​ గణపతి మండపం

భాగ్యనగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనగానే ముందుగా ఖైరతాబాద్ గణనాథుడి ఎత్తు, ఆ తర్వాత బాలపూర్ గణపతి  గుర్తుకు వస్తుంటాయి. అయితే ఈ ఏడాది బాలపూర్ గణనాథుడి ప్రతిష్టాపనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

 ప్రతి సంవత్సరం ప్రత్యేక ప్రధాన ఆలయ నమూనాతో బాలాపూర్ గణనాధుడి మండపం భక్తులని ఎంతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం బాలాపూర్ గణనాథుడి మండపాన్ని అయోధ్య బాల రాముని ఆలయ నమూనాలో తీర్చిదిద్దారు. వారం రోజుల ముందునుంచే భక్తులు బాలాపూర్‌కు వచ్చి నిర్మాణంలో ఉన్న మండపాన్ని వీక్షించి, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. 

గతేడాది (2023) బెజవాడ దుర్గమ్మ గుడి ఆకారంలో .. అంతకు ముందు ఏడాది యాదాద్రి నరసింహస్వామి ఆలయ రూపంలో మండపం ఏర్పాటు చేశారు, ఈ ఏడాది దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ప్రముఖ డెకరేటర్‌ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో అయోధ్య రామాలయం ఆకారంలో మండపాన్ని నిర్మించామని  బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి తెలిపారు.

ALSO READ | బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో కొత్త రూల్స్..

ఇక, ఈ ఏడాది బాలపూర్ గణనాథుని విగ్రహాన్నొ  దూల్​ పేటలో తయారు చేయించారు.  సెప్టెంబర్ 7 శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గణేష్ చతుర్థి రోజు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రతిష్టాపన చేశారు. ఇదిలాఉంటే, బాలాపూర్ గణనాథుడి మండపం వద్ద పనులని రాచకొండ సీపీ సుధీర్ బాబు, మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, ఇతర పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.   గణేష్ నవరాత్రులు వేళ పెద్ద సంఖ్యలో భక్తులు బాలాపూర్కు తరలిరానున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో నిఘా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.  మండప ఆవరణలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.