అయోధ్య రామాలయం ప్రధాన పూజారి సత్యేంద్రదాస్ కన్నుమూత

అయోధ్య రామాలయం ప్రధాన పూజారి సత్యేంద్రదాస్ కన్నుమూత


అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి, అయోధ్య ధామ్ ఆచార్య సత్యేంద్ర కుమార్ దాస్ మహారాజ్ ఈరోజు ఉదయం  ( ఫిబ్రవరి 12) అనారోగ్యంతో కన్నుమూశారు. 83 ఏళ్ల వయసున్న పూజారి.. ఫిబ్రవరి 3న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లక్నో ఆసుపత్రిలో చేరారు.  తొమ్మిది రోజులుగా చికిత్స పొందుతున్న ... ఆయన ఆరోగ్యం విషమించడంతో ఈ రోజు( ఫిబ్రవరి 12)  తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు ప్రకటించారు. 

ఆచార్య సత్యేంద్ర దాస్ ఈ నెల ప్రారంభంలో బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఆయనను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి సంతాపం తెలిపారు.

 బాబ్రీ మసీదు కూల్చివేసిన సమయంలోనూ రామమందిరానికి పూజారిగా ఉన్నారు. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలోనూ సత్యేంద్రదాస్ కీలక పాత్ర వహించారు. అయోధ్య రామాలయం ప్రధాన పూజారి  సత్యేంధ్ర దాస్ 20 ఏళ్ల వయస్సులోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు.  సత్యేంద్ర దాస్ 34 సంవత్సరాలుగా శ్రీరామ జన్మభూమిలో ప్రధాన పూజారిగా పనిచే స్తున్నారు. ఆయన 1945 మే 20న ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో జన్మించారు. 

సత్యేంద్ర దాస్ తన గురువు అభిరామ్ దాస్ జీ ప్రభావంతో   1958లో  అంటే 13 ఏళ్ల వయస్సులో సన్యాసం స్వీకరించారు. అప్పటి నుంచీ ఆయన తన ఇంటిని వదిలి ఆశ్రమంలో నివసించారు. నిర్వాణి అఖాడకు చెందిన దాస్, అయోధ్యలో  అందుబాటులో ఉండే సాధువులలో ఒకరు. అయోధ్యతో పాటు,  రామాలయంలో జరుగుతున్న పరిణామాలపై...  దేశవ్యాప్తంగా అనేక మంది మీడియా వ్యక్తులకు అందుబాటులో ఉండే వారు. రామమందిర ఉద్యమం, ముందుకు సాగే మార్గంపై మీడియా అడిగిన అన్ని ప్రశ్నలకు దాస్ చాలా  ఓపికగా సమాధానాలిచ్చేవారు. కూల్చివేత తర్వాత కూడా, దాస్ ప్రధాన పూజారిగా కొనసాగారు.  రామ్ లల్లా విగ్రహానికి తాత్కాలికంగా ప్రతిష్టించినప్పుడు   పూజలు చేశారు.