కాజీపేట, వెలుగు: అయోధ్యలోని భవ్య రామ మందిరంలో పూజలందుకొని ఓరుగల్లు నగరానికి వచ్చిన అక్షింతల కలశానికి హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. నగరంలో ర్యాలీ నిర్వహించారు. మడికొండలోని శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ హనుమకొండలోని జగదీశ్ మందిర్ వరకు కొనసాగింది. గురువారం సాయంత్రం మెట్టుగుట్టపై గల రామాలయంలో వేద పండితులు కలశానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వీహెచ్పీ మహానగర్ కార్యదర్శి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ 2024 జనవరిలో అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట జరగనుందన్నారు. అంక్షింతలను ఈనెల 17 తర్వాత నగరంలోని ఇంటింటికీ చేరవేస్తామన్నారు. కార్యక్రమంలో వెలగందుల రాజు, సందీప్ రెడ్డి, సాయికుమార్, రోహిత్, హరీశ్, సూర్యప్రకాశ్ రెడ్డి, స్థానికులు పాల్గొన్నారు.