నిర్మల్, వెలుగు: అయోధ్య నుంచి నిర్మల్‌కు వచ్చిన శ్రీరాముని అక్షింతలను భక్తులు ఘనంగా ఊరేగించారు. స్థానిక బాగులవాడలోని హనుమాన్ మందిరంలో బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి రావుల రామనాథ్, పార్టీ టౌన్ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్, ముఠా గణేశ్, నవీన్ తదితరులు అక్షింతలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా రావుల రామనాథ్ మాట్లాడుతూ.. నెల 22న అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి హిందువూ తమ ఇంట్లో ఐదు దీపాలను వెలిగించాలని కోరారు.