![జై శ్రీరామ్.. పట్టణాల నుంచి పల్లెల దాకా.. అంతా రామమయం..](https://static.v6velugu.com/uploads/2024/01/ayodhya-balarama-vigraham-pratishtha-program-was-watched-live-all-over-country_fAr9RUz0uK.jpg)
అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడి దర్శనంతో భారతావని పులకరించింది. శ్రీ రామ నామస్మరణతో అయోధ్యతోపాటు దేశమంతా మార్మోగుతుంది. నగరాలు, పట్టణాలు, పల్లెల దాకా శ్రీ రామ శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. అయోధ్యలో అభిజిత్ లఘ్నంలో వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. జయజయ ధ్వానాల మధ్య బాల రాముడు ఆలయంలో కొలువుదీరారు.
ఈ అపూర్వఘట్టాన్ని భక్తులు వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల్లో పలు ఆలయాలు దగ్గర బిగ్ స్క్రీన్ పై ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించిపోయారు. మరికొన్ని ఆలయాల దగ్గర భక్తులు కోలాటాలు వేస్తూ.. సాంప్రదాయ నృత్యాలు చేశారు. ప్రధాన రహదారుల వెంబడి జై శ్రీరామ్ అనే నినాదాలతో రథయాత్ర చేపట్టారు. మరికొన్ని ఆలయాల దగ్గర భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.