అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ.. భద్రాచలంలో రథోత్సవం

అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సమయంలో భద్రాచలంలో రథోత్సవం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జై శ్రీరామ్ నినాదాలతో పట్టణమంతా మార్మోగింది. ఈ సందర్భంగా భక్తులు డప్పులు వాయిస్తూ, కోలాటాలు వేస్తూ.. సాంప్రదాయ నృత్యాలు చేశారు. ప్రధాన రహదారుల వెంబడి జై శ్రీరామ్ అనే నినాదాలతో రథయాత్ర చేపట్టారు.

ఆ తర్వాత శ్రీరాముడి ప్రాముఖ్యతను అర్చకులు భక్తులకు వివరించారు. అటు స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత వైభవంగా నిర్వహించిన శోభాయాత్రతో భద్రాచలం పట్టణమంతా కాషాయమయమై, రామనామ స్మరణతో హోరెత్తింది.