
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లా అదనపు మేజిస్ట్రేట్ ( లా అండ్ ఆర్డర్ ) సూర్జిత్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సుర్సారి కాలనీలోని తన నివాసంలో గురువారం (అక్టోబర్ 24) ఆయన శవమై కనిపించారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సూర్జిత్ సింగ్ మరణంపై ఆరా తీశారు.
ALSO READ | కాశ్మీర్లో వలస కార్మికులపై మరోసారి ఉగ్రదాడి..ఒకరికి తీవ్రగాయాలు
పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్‌బాడీని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయోధ్య జిల్లా ఎస్పీ రాజ్ కరణ్ నయ్యర్ మేజిస్ట్రేట్ సూర్జిత్ సింగ్ మరణాన్ని ధృవీకరించారు. సూర్జిత్ సింగ్ మరణానికి గల కారణం ఏంటన్నది ప్రస్తుతానికి తెలియదని.. మృతిపై దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.