కుభీర్, వెలుగు: రాముడిపై ఉన్న భక్తితో కుభీర్ నుంచి అయోధ్య వరకు పాదయాత్ర చేసి బాల రాముడి దర్శనం చేసుకున్న మండల కేంద్రానికి చెందిన జాదవ్ మాధవ్ పటేల్ తిరిగి ఇంటికి చేరుకున్నారు. గత నెల 27న కుభీర్ నుంచి అయోధ్యకు బయలుదేరిన మాధవ్ పటేల్ 1200 కి.మీ. పాదయాత్ర చేసి ఈనెల 22న బాల రాముడిని దర్శించుకొని తిరిగి శనివారం కుభీర్కు చేరుకున్నాడు.
ఈ సందర్భంగా మహిళలు ఆయనకు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం విఠలేశ్వర ఆలయంలో జాదవ్ మాధవ్ పటేల్ కు సర్పంచ్ మీరా విజయ్ కుమార్తో పాటు ఆయా కుల సంఘాల నాయకులు, పలువురు సన్మానించారు.