అయోధ్య రామ్ లల్లాకు ఏడాది..జనవరి 11 నుంచి ప్రతిష్టాపన వార్షికోత్సవాలు

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్టకు ఏడాది పూర్తవుతుండటంతో  వార్షికోత్సవాలకు ముస్తాబయ్యింది .  జనవరి 11 నుంచి మూడు రోజుల పాటు  అయోధ్యలో ప్రతిష్ట ద్వాదశి వార్షికోత్సవాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  రామ్ లల్లా అభిషేకాన్ని నిర్వహించనున్నారు. ప్రతిష్ఠా ద్వాదశి ప్రారంభ రోజున రామ్ లల్లా..  బంగారు , వెండి దారాలతో ఢిల్లీలో తయారు చేయబడిన ప్రత్యేకమైన పీతాంబరిలో కనువిందు చేయనున్నాడు. ఈ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగంతో పాటు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తోంది.  జనవరి 11 అయోధ్య ధామ్‌లో కొత్తగా నిర్మించిన ఆలయాన్ని స్థాపించి ఒక సంవత్సరం అవుతుంది.

పంచామృతం, సరయూ జలాలతో అభిషేకం చేసిన గతేడాది ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మాదిరిగానే ఉదయం 10 గంటలకు అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది.మొదటి హారతి మధ్యాహ్నం 12:20కి  ఇస్తారు..

దాదాపు 110 మంది VIPలు హాజరవుతారని అంచనా వేశారు అధికారులు. అంగద్ తిలా దగ్గర ఉన్న ఒక జర్మన్ హ్యాంగర్ టెంట్‌లో 5,000 మంది వ్యక్తులు కూర్చోవడానికి ఏర్పాట్లు చేశారు. ఈ సంవత్సరం, సాంస్కృతిక ప్రదర్శనలు, ఆచారాలు , రామ్ కథా ప్రసంగాలను వినడానికి గత సంవత్సరం వేడుకకు హాజరుకాని సాధారణ పౌరులను ట్రస్ట్ ఆహ్వానించింది.

ALSO READ | సంక్రాంతి స్పెషల్: పతంగుల పండుగకి హైదరాబాద్ రెడీ

2024 జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు.. 84 సెకన్లపాటు.. శాస్త్రోక్తంగా.. ఆచారం ప్రకారం బాల రాముడికి ప్రాణం పోశారు పూజారులు. ఈ మహా ఘట్టంతో.. అయోధ్య రాముడు అందరివాడు అయ్యాడు. భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా.. ధర్మాన్ని నాలుగు పాదాలపై నడిపించే యుగ పురుషుడిగా.. భక్త కోటి నుంచి నిత్యం పూజలు అందుకుంటున్నాడు.