అయోధ్య నగరం ఐదు శతాబ్దాల తర్వాత కొత్త శోభను సంతరించుకుంది. రామజన్మభూమిలో ఆలయ నిర్మాణం వడివడిగా పూర్తి చేసుకుని బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దీంతో.. అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా తయారైంది. ప్రభుత్వ యంత్రాంగం యూనిఫాం కలర్ కోడ్, యూనిఫాం బిల్డింగ్ కోడ్ అమలు చేస్తూ.. చారిత్రక వైభవం, సంస్కృతి ప్రతిబింబించేలా అయోధ్యలోని భవనాలను తీర్చిదిద్దింది.
బాల రామయ్య తన జన్మ స్థలంలో ప్రతిష్ఠించేందుకు పండితులు పూజలు ప్రారంభించారు. దీంతో జగమంతా రామ మయం అన్న చందంగా ఎక్కడ చూసినా రామ మందిర ముచ్చట్లే.. ఏ నోట వున్నా రామ నామ స్మరణే.. ఆధ్మాత్మిక విశ్వనగరి అయోధ్య అందంగా ముస్తాబయింది. కన్నుల పండుగగా జరిగే ఈ చారిత్రాత్మక ఘట్టం వీక్షించేందుకు యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
ఒకరకంగా చెప్పాలంటే.. అయోధ్య నగరంలో ఇప్పుడు రామాలయం ఒక్కటే కాదు.. అయోధ్యలో ప్రతి ఇల్లును శుభ్రం చేసుకుంటున్నారు.తమ ఇళ్లను రంగు రంగుల ముగ్గులతో అలంకరించుకుంటున్నారుఅయోధ్య వాసులు. ఇప్పటికే అయోధ్య నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దారు. పూర్తి చేసుకున్న ఆలయ పనులు యాత్రికులను ఆకట్టుకుంటున్నాయి.