అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడు కొలువుదీరిన నేపథ్యంలో రామ్ లల్లాను దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. దేశ నలుమూలతో పాటు తెలంగాణ నుంచి భారీగా భక్తులు వెళుతున్నారు. ఇక దొంగలు కూడా ఇదే అదునుగా భావించి, భక్తుల నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లతున్నారు.
తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్ జిల్లాకు చెందిన భక్తులు రామ్ లల్లాను దర్శించుకోవడానికి వెళ్లడంతో అక్కడ ఓ భక్తురాలి బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు దాదాపు 60 మంది మంగళ సూత్రాలు కాజేసినట్లు బాధితుల నుంచి ఫిర్యాదు అందిందని తెలిపారు. అక్కడి వీడియోలను విడుదల చేశారు పోలీసులు.
అయోధ్య ఆలయం ప్రారంభోత్సవం వరకు చీమ చిటుక్కుమన్నా పట్టేసిన పోలీసులు.. ప్రాణ ప్రతిష్ఠ వేడుకు ముగిసిన తర్వాత బాగా రిలాక్స్ అయ్యారు.. హై సెక్యూరిటీ అంతా మాయం అయ్యింది.. లోకల్ పోలీసులు కూడా కొంచెం సేదతీరారు. దీంతో రెండో రోజు అయోధ్య రామయ్య దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భక్తుల తోపులాటలు జరిగాయి. ఇదే అదునుగా దొంగల చెలరేగిపోయారు.. దొంగతనాలకు పాల్పడ్డారు.
ప్రాణప్రతిష్ట కార్యక్రమం వరకు భారీ భద్రతను ఏర్పాటు చేసిన యూపీ సర్కార్ ఇపుడు పూర్తిగా చేతులెత్తేసింది. జనవరి 23 నుంచి అయోధ్యలో భక్తులకు ఎంట్రీ ఇవ్వడంతో అయోధ్య రామ్ లల్లా దర్శనం కోసం భక్తులతో కిక్కిరిసిపోయింది. భద్రతను పెంచాల్సిన పోలీసులు అయోధ్య పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తొలగించారు.
దీంతో వందలాది భక్తుల మోబైల్స్, పర్సులు, బంగారం చోరీకి పాల్పడ్డారు దొంగలు. స్థానిక పోలీస్ స్టేషన్లో భక్తులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు. భక్తుల నుంచి ఎఫ్ఐఆర్ తీసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు పోలీసులు. దీంతో విలువైన వస్తువులు కోల్పోతున్నామని అయోధ్య భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.