రామమందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేసిన మోడీ

రామమందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేసిన మోడీ

అయోధ్యలో రామమందిర నిర్మాణ ఏర్పాటుకు ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ప్రధానమంత్రి నరేంధ్ర మోడీ. బుధవారం లోక్ సభలో మాట్లాడిన మోడీ ఈ ప్రకటన చేశారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ..  9 నవంబర్ 2019న సుఫ్రీంకోర్టు వివాద స్థలంగా ఉన్న రామజన్మభూమిని.. శ్రీరామ జన్మస్థలంగా గుర్తిస్తూ అక్కడ రామాలయం కట్టుకోవచ్చని తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. సుప్రీం ఆదేశాల మేరకు తాము ఇప్పుడు రామమందిర నిర్మాణంకోసం ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ట్రస్ట్ పేరు ‘శ్రీరాంజన్మ భూమి తీర్త క్షేత్ర్ ట్రస్ట్’ అని నామకరణం చేస్తున్నట్లు చెప్పారు. ఈ ట్రస్ట్ ఆలయనిర్మాణంతో పాటు.. దాని సంబంధ విషయాలపై నిర్ణాయాలను స్వతంత్రంగా తీసుకుంటుందని ఆయన తెలిపారు. గుడికోసం ఉన్న దాదాపు 67 ఎకరాలలో ఆలయనిర్మాణం జరుగుతుందని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశించినట్టుగానే… సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల స్థలాన్ని ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ అందిస్తున్నట్లు చెప్పారు .

మన దేశం.. మన సంసృతి, మన పరంపర వసుదైక కుటుంబంతో పాటు ప్రతీ ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటుందని  ముందడుకు ప్రేరణ అని మోడీ చెప్పారు. భారత దేశంలో హిందువైనా, సిక్కు అయినా, ముస్లిమైనా ఒకటేనని చెప్పారు. ఏపరివారానికి చెందిన వారైనా.. వారందరూ సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. తన ప్రభుత్వం సబ్ కా సాత్ సబ్ కా వికాస్, సబ్ కా  విశ్వాస్ తోనే ముందుకు వెళ్తుందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ రామమందిర నిర్మాణానికి కలిసిరావాలని కోరారు.

మరిన్ని వార్తలకోసం క్లిక్ చేయండి

గాంధీ హాస్పిటల్ లో కరోనా టెస్టులు

అమలాపాల్ నెక్స్ట్‌ స్టాప్‌ అదే!

ఈ నెలలో విడుదలవుతున్న స్మార్ట్ ఫోన్లు ఇవే..!

చర్మ ఆరోగ్యానికి నలుగు.. ఇలా తయారు చేసుకోండి