
-
రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం
ఢిల్లీ: అయోధ్య రామ మందిరంలో కొత్తగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జారీ చేసిన రోస్టర్ సిస్టంకు బ్రేకులు పడ్డాయి. అర్చకులు గతంలోనే మాదిరిగానే రాంలల్లాకు పూజలు చేస్తారని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. అర్చకుల నుంచి రోస్టర్ విధానంపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అమలును వేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. అర్చకులందరూ ట్రస్టుకు ఇచ్చిన లేఖతో ట్రస్టు తన నిర్ణయాన్ని ఉప సంహరించుకుంటుందని ఆలయ ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు.
ప్రస్తుతం అర్చకులు అంతా గతంలోనే మాదిరిగానే సేవ చేస్తారన్నారు. శ్రావణ మాసాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ అర్చకులతో సమావేశం నిర్వహించింది. వారిని నాలుగు గ్రూపులుగా విభజించింది. రామమందిరం, కుబేర్ తిల, యజ్ఞశాల స్థలంలో పది గంటల పాటు విధుల్లో ఉండాలని షరతు విధించిందని చెప్పారు.
Also Read:-అసెంబ్లీకి వస్తారా..? లేదా..?.. తొలిరోజు అసెంబ్లీకి కేసీఆర్ డుమ్మా