అయోధ్యలో రామయ్య ప్రభువు కొలువు దీరే వేళ తన అత్తగారింటి నుంచి సీతామాత జన్మస్థలమైన ...బీహార్ లోని మిథిల జిల్లా సీతామఢీ నుంచి భారీగా కానుకలు అయోధ్యకు చేరుకున్నాయి. సీతమ్మ లేని రాముడు లేడు, రామాయణం లేదని.. ఈ పరిస్థితుల్లో సీతామాత పుట్టిన ఊరిని కూడా అభివృద్ధి చేస్తే మైథిలి ప్రాంతవాసులకు ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు. శ్రీరాముడికి అందుతున్న కానుకలతో పాటు కొత్త వినతులు కూడా తెరపైకి వస్తున్నాయి.
ఎవరింట్లోనయినా శుభకార్యం జరుగుతుందంటే.. సహజంగా భార్య పుట్టింటి వారు కానుకలు పంపిస్తారు. ఈ ఆచారం కృత యుగం నుంచి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఈ నాటి కలియుగం వరకు ప్రతి ఇంట్లో శుభకార్యానికి అత్తమామలు పంపే కానుకల గురించి చర్చ జరుగుతుంది... జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడికి సంబంధించిన మహోన్నత కార్యక్రమం జరగబోతుంది. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు తన అత్తగారిల్లైన సీతామాత జన్మ స్థలమైన బీహార్ లోని మిథిల జిల్లా సీతామఢీ నుంచి భక్తులు భారీగా కట్నకానుకలు తెచ్చారు.
హిందూ పురాణాల ప్రకారం త్రేతాయుగంలో అయోధ్య నగరంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు. ఇప్పుడు కలియుగంలో రామజన్మభూమి అయోధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మహోన్నత కార్యక్రమం కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో జనవరి 22న శ్రీరాముడు కొలువు దీరేసమయంలో సీతామాత జన్మ స్థలమైన బీహార్ లోని మిథిల జిల్లా సీతామఢీ నుంచి భక్తులు భారీగా కట్నకానుకలు తెచ్చారు.
అయోధ్యలో దివ్య, భవ్య రామాలయం ప్రారంభోత్సవమౌతున్న సందర్భంగా సీతామాత జన్మ స్థలమైన బీహార్ మిథిల జిల్లా సీతామఢీ నుంచి భక్తులు భారీగా కట్నకానుకలు తెచ్చారు. రాముడి అత్తారింటి నుంచి రావాల్సిన కానుకలన్నింటిని సీతామఢీ వాసులు ట్రక్కుల్లో తీసుకొచ్చారు..
అయోధ్యలో కొలువుదీరనున్న శ్రీ రామ చంద్రుడికి కానుకల వర్షం కురుస్తోంది. దేశ విదేశాల నుంచి బహుమతులు వస్తున్నాయి. వాటన్నింటిలోకి ప్రత్యేకంగా నిలుస్తున్నది మాత్రం శ్రీరాముడి అత్తమామల ఇంటి నుంచి వచ్చే కానుకలే. సీతామాత స్వస్థలమైన బీహార్‌లోని సీతామఢి నుంచి కానుకలతో కూడిన ట్రక్కులు అయోధ్య చేరుకున్నాయి. వాటిలో ధన, ధాన్య, కనకాది వస్తువులన్నీ ఉన్నాయి. అలాగే దుస్తులు, దుప్పట్లతో పాటు ఓ కొత్త జంటకు కావాల్సిన గృహోపకరణ వస్తువులు ఉన్నాయి. ఆ కానుకలు తీసుకుని అయోధ్య చేరుకున్న సీతామఢి వాసులు.. రామజన్మభూమి తరహాలోనే సీతా జన్మ స్థలాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.
అయోధ్యలో ఆలయ నిర్మాణం సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే ప్రారంభమైందన్న విషయం అందరికీ తెలుసు. కొన్ని దశాబ్దాల క్రితమే ఆలయ నిర్మాణానికి అవసరమైన స్తంభాలు, ఇతర వస్తువులు సిద్ధమయ్యాయి. అయోధ్యలో ఆ ప్రాంతాన్ని రామ జన్మ భూమి కార్యశాలగా పిలుస్తారు. అయోధ్యను సందర్శించడానికి వచ్చే ప్రతీ ఒక్కరూ ఆ కార్యశాలను సందర్శించకుండా తిరిగి వెళ్లరు.
సీతమ్మ లేని రాముడు లేడు, రామాయణం లేదని.. ఈ పరిస్థితుల్లో సీత పుట్టిన ఊరిని కూడా అభివృద్ధి చేస్తే మైథిలి ప్రాంతవాసులకు ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు. శ్రీరాముడికి అందుతున్న కానుకలతో పాటు కొత్త వినతులు కూడా తెరపైకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రామాయణ్ సర్క్యూట్‌లో సీతామఢి పునౌరా ధామ్ కూడా ఉంది. ఇక్కడే సీతా కుండ్, సీతా వాటిక, లవ్-కుశ్ వాటిక ఉన్నాయి. అయోధ్యలో రామాలయ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా బీహార్‌లోని నితీశ్ ప్రభుత్వం ఇటీవలే ఈ క్షేత్ర అభివృద్ధి కోసం.. 72 కోట్ల రూపాయలు కేటాయించింది. పెద్ద ఎత్తున పనులు చేపట్టింది. అయోధ్య తరహాలో సీతామాత జన్మభూమిని అభివృద్ధి చేయాలని బీహార్ వాసులు కోరుతున్నారు. సీతామఢి ప్రాంతాన్ని అయోధ్య మాదిరిగా తీర్చిదిద్దాలని భక్తులు కోరుతున్నారు