Ayodhya: అయోధ్యలో అద్భుతం..రామ్ లల్లా నుదిటిపై సూర్య తిలకం

Ayodhya: అయోధ్యలో అద్భుతం..రామ్ లల్లా నుదిటిపై సూర్య తిలకం

శ్రీరామ నవమి శుభ సందర్భంగా అయోధ్య రామాలయంలో అద్భుతం చోటుచేసుకుంది. నవమి రోజున బాలరామయ్యకు మధ్యాహ్నం12 గంటలకు అభిషేకం నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం12 గంటలకు సూర్యకిరణాలు బాలరాముడి నుదిటిపై నాలుగు నిమిషాల పాటు ప్రసరించాయి. ఈ దివ్యఘట్టాన్ని 'సూర్య తిలకం' అని పిలుస్తారు. 

ఆలయంలో జరిగిన అద్భుతాన్ని యావత్‌ దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులు తిలకించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఆలయ ట్రస్ట్‌. ఈ దివ్య సంఘటన రాముడి జననాన్ని ప్రతీకగా సూచిస్తుంది. సూర్యకిరణం దేవత నుదిటిపై ప్రకాశింపజేసి వేడుకలకు ఆధ్యాత్మిక ప్రకాశాన్ని జోడించింది.

►ALSO READ | దేశంలోనే తొలి లిఫ్ట్ బ్రిడ్జ్(పంబన్ వంతెన)..ఇవాళ(ఏప్రిల్ 6) ప్రారంభోత్సవం