- 25 లక్షల దివ్వెల వెలుగుల గిన్నిస్ రికార్డు
లక్నో : దీపావళి సందర్భంగా అయోధ్యలో భవ్య దీపోత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రామమందిరం ప్రారంభమైన తర్వాత తొలిసారి వేడుకలు నిర్వహిస్తుండటంతో భారీగా ఏర్పాట్లు చేశారు. అయోధ్యలోని సరయూ నది ఘాట్ లలో 25 లక్షల దివ్వెల వెలుగులతో నిర్వహించిన భవ్య దీపోత్సవ్ గిన్నిస్ రికార్డులను సృష్టించింది. మొత్తం 55 ఘాట్‌లలో ఏ ర్పాటు చేసిన ప్రమిదలను ప్రత్యేక డ్రోన్లతో గిన్నిస్ ప్రతినిధులు లెక్కించారు.
సరయూ నది ఘాట్ లో 1100 మంది హారతులు ఇచ్చారు. అయోధ్య వీధుల్లో రామలక్ష్మణుల ను ఊరేగించారు. ఈ రథాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ లాగారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. ఇయ్యాల కాశీ వెలిగిపోతోందని.. ప్రపంచం మొత్తం మహా కాశీని చూస్తోందని తెలిపారు. ఇది మనందరికి ఎంతో గర్వకారణమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.