నిజామాబాద్ క్రైమ్, వెలుగు: నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్ లో దసరా పండుగ సందర్భంగా ఆయుధ పూజతో పాటు వాహనాలకు, బీడీ టీమ్ సామగ్రికి పూజలు చేశారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయుధాలు, వాహనాల పనితీరును సీపీ పరిశీలించారు. డీసీపీలు, ఏసీపీలు బి.కోటేశ్వర రావు, శంకర్ నాయక్, బస్వారెడ్డి, నాగయ్య పాల్గొన్నారు.
కామారెడ్డిటౌన్: విజయ దశమి నుంచి అన్ని విజయాలే కలగాలని కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా సాయుధ దళ విభాగంలో ఎస్పీతో పాటు, ఇతర ఆఫీసర్లు ఆయుధ పూజ నిర్వహించారు. ప్రతి పనిలో ఆఫీసర్లు, సిబ్బందికి విజయం కలగాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణలో ముందండాలన్నారు. అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ యాకుబ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ జార్జ్, కామారెడ్డి టౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఐలు నవీన్ కుమార్, సంతోష్ కుమార్, కృష్ణ పాల్గొన్నారు.