
నలుగుపిండి స్నానం అనంగనే మోటుపద్ధతి అనుకుంటరు ఇప్పటి జనరేషన్. కానీ దానివల్ల ప్రయోజనం ఎంత ఉంటుందో సరిగ్గా తెలుసుకుంటే వందలు ఖర్చుపెట్టి కెమికల్స్ కొనరు. ఒక్కసారి నలుగుపిండితో స్నానం చేసి చూడండి. రిజెల్ట్ మీకే అర్థమవుతుంది.
ఇట్ల తయారు చేస్తరు
బియ్యప్పిండి, శెనగపిండి గరుకుగా పొడి చేసి కలపాలి. ఈ పొడిలో నువ్వులనూనె కలపాలి. నలుగు పిండి మరీ తడిగా ఉండకూడదు. ఒంటికి పట్టించి, రివర్స్ యాంగిల్లో మర్దనా చేయాలి. దీనివల్ల ఒంటికి అంటుకున్న మురికి, అవాంఛిత రోమాలు, మృతకణాలు తొలగిపోతాయి. చివర్లో కొంచెం నువ్వుల నూనె చర్మానికి రాయాలి. లేదంటే ఆవుపాల మీద మీగడ వాడుకోవచ్చు. వారానికి ఒకసారైనా ఒంటికి నలుగు పెట్టుకుంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. కావాలంటే పసుపు, ఆవపిండి, ఉలవ పిండి, గంధం, మారేడు పత్రాల పొడులను ఉపయోగించి కూడా నలుగు పెట్టుకోవచ్చు.