టీమిండియా బ్యాటర్ ఆయుష్ బదోని స్టన్నింగ్ క్యాచ్ తో ఆశ్చర్యానికి గురి చేశాడు. బౌండరీ దగ్గర పక్షిలా విన్యాసం చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఎమర్జింగ్ ఆసియా కప్ 2024లో భాగంగా భారత్, యూఏఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 15వ ఓవర్ చివరి బంతిని రమణదీప్ సింగ్ ఫుల్-లెంగ్త్ బాల్ వేశాడు. యూఏఈ బ్యాటర్ జవదుల్లా లాంగన్ దిశగా భారీ షాట్ ఆడాడు. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న బడోని మెరుపు వేగంతో వచ్చి బంతిని అందుకున్నాడు.
చాలా దూరం పరిగెత్తుకుంటూ వస్తూ ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి క్యాచ్ ఒడిసి పట్టుకున్నాడు. దీంతో యూఏఈ ఆటగాడు షాక్ అయ్యాడు. ఈ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా–ఎ యూఏఈని చిత్తు చేసింది. బౌలింగ్‌లో రసిఖ్ సలామ్ (3/15), బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ (24 బాల్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 58) సత్తా చాటడంతో సోమవారం జరిగిన గ్రూప్–బి రెండో మ్యాచ్‌లో ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ALSO READ | Ranji Trophy 2024-25: బరువు తగ్గుతలే.. బాడీలో 30 శాతం కొవ్వు: ముంబై నుండి పృథ్వీ షా ఔట్
టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ 16.5 ఓవర్లలో 107 రన్స్‌కే ఆలౌటైంది. రాహుల్ చోప్రా (50) ఫిఫ్టీతో మెరవగా కెప్టెన్ బాసిల్ హమీద్ (22) ఫర్వాలేదనిపించాడు. రసిఖ్‌తో పాటు రమణ్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టడంతో మిగతా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇండియా బౌలర్ల దెబ్బకు యూఏఈ జట్టులో ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ఛేజింగ్‌లో ఇండియా 10.5 ఓవర్లలోనే 111/3 స్కోరు చేసి గెలిచింది.
తొలి ఓవర్లోనే ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (8) ఔటైనా కెప్టెన్ తిలక్ వర్మ (21)తో కలిసి అభిషేక్ రెండో వికెట్‌కు 73 రన్స్ జోడించాడు. ఆయుష్ బదోనీ (12 నాటౌట్) 6, 4తో మ్యాచ్‌ను ముగించాడు. రసిఖ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఇండియా 4 పాయింట్లతో గ్రూప్–బిలో టాప్ ప్లేస్‌లో ఉంది. బుధవారం జరిగే చివరి లీగ్ పోరులో ఒమన్‌తో పోటీ పడనుంది.
WHAT A CATCH BY AYUSH BADONI 🥶🔥 pic.twitter.com/dt7PRcberN
— Johns. (@CricCrazyJohns) October 21, 2024