IPL 2025: గైక్వాడ్ స్థానంలో 17 ఏళ్ళ చిచ్చర పిడుగు.. ఎవరీ ఆయుష్ మాత్రే..?

IPL 2025: గైక్వాడ్ స్థానంలో 17 ఏళ్ళ చిచ్చర పిడుగు.. ఎవరీ ఆయుష్ మాత్రే..?

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఏదీ కలిసి రావడం లేదు. వరుస పరాజయాలు ఆ జట్టును ఈ సీజన్ లో వెనక్కి నెడుతున్నాయి. తొలి మ్యాచ్ లో ముంబైపై గెలిచి గ్రాండ్ గా సీజన్ ఆరంభించినా.. ఆ తర్వాత వరుసగా ఐదు పరాజయాలు చెన్నైను కృంగదీశాయి. ఫస్ట్ హాఫ్ ముగియకుండానే ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఆ జట్టు మిగిలిన 8 మ్యాచ్ ల్లో 7 గెలవాల్సి ఉంది. ఈ దశలో చెన్నై కంబ్యాక్ ఇద్దామనుకుంటే ఊహించని షాక్ తగిలింది.

కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. సీజన్ ప్రారంభంలో గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  గైక్వాడ్ కుడి మోచేతికి గాయం అయింది. గైక్వాడ్ మోచేయి ఎముక విరిగినట్టు సమాచారం. అతని గాయం సూపర్ కింగ్స్ జట్టును మరింత ఆందోళనకు గురి చేసింది. గైక్వాడ్ స్థానంలో సీజన్ లోని మిగిలిన మ్యాచ్ ల కోసం ముంబై బ్యాటర్ ఆయుష్ మాత్రే చెన్నై జట్టులో చేరనున్నాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ సోమవారం (ఏప్రిల్ 14) లక్నో సూపర్ జయింట్స్ తో తలపడుతుంది. 

Also Read :- గుండె పట్టుకున్న కోహ్లీ.. ఆందోళనలో విరాట్ ఫ్యాన్స్..! 

ఏప్రిల్ 20న ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు ఆయుష్ మాత్రే జట్టులో చేరతాడని CSK వర్గాలు స్పోర్ట్‌స్టార్‌తో ధృవీకరించాయి. కొంతమంది దేశీయ క్రికెటర్లతో పాటు మాత్రేను గతంలో చెన్నైకి ట్రయల్ కోసం పిలిపించారు. 17 ఏళ్ల ఈ యువ క్రికెటర్ ను దూకుడుగా బ్యాటింగ్ చేయగలడనే కారణంగా చెన్నై ఎంపిక చేసింది. దేశవాళీ క్రికెట్ లో ముంబై జట్టు తరపున తొమ్మిది ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో.. మాత్రే రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో సహా 504 పరుగులు చేశాడు. లిస్ట్ ఎ క్రికెట్ లో 7 మ్యాచ్ ల్లో రెండు సెంచరీలతో 458 పరుగులు చేశాడు.