ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎన్నిక..

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికి ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి అయ్యన్న పాత్రుడు పేరును ప్రకటించారు.

 అనంతరం సభ్యుల ఏకగ్రీవ ఆమోదంతో అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అయ్యన్న పాత్రుడికి శుభాకాంక్షలు తెలిపారు. గౌరవప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు.