- అయ్యప్ప భక్తుల మనోభావాలు దెబ్బతీశారు
- తెలంగాణ అయ్యప్ప ఐక్యవేదిక డిమాండ్
ఖైరతాబాద్, వెలుగు : అయ్యప్పస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా సినీ నటుడు రామ్ చరణ్ వ్యవహరించారని, వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ అయ్యప్ప ఐక్యవేదిక డిమాండ్చేసింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నాయిని బుచ్చిరాజు గురుస్వామి, ప్రేమ్ గాంధీ గురుస్వామి, రాధాకృష్ణ గురుస్వామి మీడియాతో మాట్లాడారు. మాల వేసుకున్న రామ్‌చరణ్ ప్రముఖ సంగీత దర్శకుడితో కలిసి కడప దర్గాలోకి వెళ్లడాన్ని ప్రశ్నించారు.
దర్గాలోకి వెళ్లిన వ్యక్తి బొట్టు, విభూది తొలగించడాన్ని ఖండిస్తున్నామన్నారు. బొట్టు, విభూది తొలగించి తలకు తెల్లరంగు రుమాలు చుట్టుకోవడమేమిటన్నారు. తమ మనోభావాలు దెబ్బతీసిన రామ్చరణ్ఐదు రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.