ములుగు, వెలుగు : అయ్యప్ప పడిపూజ మహోత్సవం ములుగులో వైభవంగా జరిగింది. భక్తమండలి ఆధ్వర్యంలో గురువారం మాలధారణ భక్తులు రామాలయం నుంచి జాతీయ రహదారి మీదుగా శివాలయం, తదితర వీధుల్లో నగర సంకీర్తన చేశారు. ఈ సందర్భంగా శివపార్వతులు, వినాయకుల వేషధారణతో భక్తులు వేసిన నృత్య ప్రదర్శన అలరించాయి.
అనంతరం రామాలయ ప్రాంగణంలో 18మెట్లతో కూడిన ఉత్సవాన్ని మాల ధారణ భక్తులు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తమండలి సభ్యులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, పైడిమల్ల గోపి, కొత్త సురేందర్, వాసుదేవ రెడ్డి, బాణాల రాజ్ కుమార్, సానికొమ్ము శ్రీనాథ్ రెడ్డి, కొండి రవీందర్, ఆవుల ప్రశాంత్ రెడ్డి, రవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.