నర్సంపేట, వెలుగు: స్వామియే శరణం అయ్యప్ప అంటూ స్వాములు చేసిన శరణుగోషతో నర్సంపేట మార్మోగింది. సోమవారం నిర్వహించిన అయ్యప్ప పంబా ఆరట్టు వేడుకలు అంబరాన్నంటాయి. అంతకుముందు అయ్యప్ప స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి స్వప్న దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి మణికంఠ స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా మాదన్నపేట పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లారు.
జలక్రీడలు నిర్వహించిన అనంతరం తిరుపతికి చెందిన బ్రహ్మశ్రీ వెంకటేశ్వరశర్మ, అర్చకుల ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించారు. పూజల్లో వేలాది మంది అయ్యప్ప మాలధారులు, భక్తులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మున్సిపల్చైర్పర్సన్గుంటి రజనీ కిషన్, శానబోయిన రాజ్‌కుమార్, దేవాలయ కమిటీ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.