గంగాధర, వెలుగు: గంగాధర మండలం మధురానగర్ ఆనందగిరి అయ్యప్ప దేవాలయం నుంచి స్వాములు గురుస్వామి సిరిసిల్ల ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం కొండగట్టుకు పాదయాత్రగా తరలివెళ్లారు. ఈ పాదయాత్రను ఎంపీపీ శ్రీరామ్ మధుకర్ జెండా ఊపి ప్రారంభించారు.
పాదయాత్రలో గురుస్వామి శ్రీమల్ల మేఘరాజు, కన్నెస్వామి సన్నిధానం బృందం 36 మంది అయ్యప్పస్వాములు పాల్గొన్నారు.