శబరిమల అయ్యప్ప భక్తుల శరణుఘోషతో మారుమోగుతోంది. ఎన్నడూ లేనంతగా ఈ సారి భారీ స్థాయిలో భక్తులు తమ మొక్కులను తీర్చుకునేందుకు తరలివస్తున్నారు. కేవలం 39 రోజుల్లోనే శబరిమల ఆలయం ఆదాయం రూ. 200 కోట్లు దాటిందంటే ఇక్కడ భక్తుల తాకిడి ఎలా ఉందో అర్థమవుతోంది. అయితే ఇదే తరహాలో ఓ దేశంలోనూ అయ్యప్ప భక్తులు అయ్యప్ప ఆలయానికి క్యూలు కడుతున్నారు. శబరిమల తరహాలోనే ఇక్కడికీ భక్తులు తమ తలపై ఇరుముళ్లతో స్వామియే శరణమయ్యప్ప అనే శరణునాదాలతో తరలివెళ్తున్నారు.
అయ్యప్ప భక్తులు, ఆలయం అనగానే దేశంలో వెంటనే గుర్తొచ్చేది శబరిమల. కానీ లండన్ లోనూ ఇదే తరహాలో భక్తులు తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఇది లండన్ లో ఎక్కడన్న విషయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. మరో ముఖ్య విషయమేమిటంటే.. శబరిమలకు కేవలకు మగవారు, పిల్లలు, పెద్దవారికి మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుంది. కానీ వైరల్ అవుతున్న ఈ క్లిప్స్ లో ఆడవాళ్లు కూడా ఆలయంలో ప్రార్థనలు చేస్తున్నారు.
కేవలం మనదేశంలోనే అయ్యప్ప భక్తులు ఉంటారని చాలా మంది అనుకుంటారు. కానీ ఇతర దేశాల్లోనూ అయ్యప్ప భక్తులు తమ కోరికలను, మొక్కులను తీర్చుకోవడానికి వెళ్తుండడం ఒకింత విస్మయానికి గురి చేస్తోంది.
It is not in India.
— ?️?️?? ℝ???? ?? (@BaluReddyUK) December 26, 2023
It's in London,UK #SwamiSharanam
?️? pic.twitter.com/cKSl4VqEYC